Andhra Pradesh
సొంత కార్యకర్త మృతిపై జగన్లో పశ్చాత్తాపం లేదని గొట్టిపాటి ఆరోపణ
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కారు కింద పడి సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన ఘటనపై రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవి తీవ్రంగా స్పందించారు. ఈ సంఘటనలో జగన్ నిర్లక్ష్య వైఖరిని ఆయన తప్పుబట్టారు.
గొట్టిపాటి మాట్లాడుతూ, “బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకుని చనిపోయిన వ్యక్తి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వెళ్తూ జగన్ కారు ఢీకొని ఇద్దరి ప్రాణాలు తీసింది. ప్రమాదం జరిగిన వెంటనే సింగయ్యను ఆస్పత్రికి తరలించి ఉంటే బతికేవారు. కానీ, సొంత కార్యకర్త కారు కింద పడినా పక్కకు ఈడ్చేసి జగన్ వెళ్లిపోయారు. ఈ ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందినా జగన్‌లో కనీసం పశ్చాత్తాపం కూడా కనిపించలేదు” అని విమర్శించారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.