Andhra Pradesh
‘వార్ 2’ ట్రైలర్‌తో మాస్ హంగామా: ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!
యశ్ రాజ్ ఫిలింస్ రూపొందిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ వార్ 2 ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో భారీ యాక్షన్, గ్రాండియర్ విజువల్స్, స్టైల్ ఓరియెంటెడ్ సీన్స్ ట్రైలర్ నుంచే ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి. ఎన్టీఆర్ ఇంట్రడక్షన్, ఆయన డైలాగ్ డెలివరీ, యాక్షన్ సన్నివేశాలు ట్రైలర్‌కి హైలైట్ గా నిలిచాయి. ఫాన్స్ మాటల్లో చెప్పాలంటే – “ఇది సినిమా కాదు.. థియేటర్లలో మాస్ వీరంగానికి స్టార్ట్ సిగ్నల్” అని వ్యాఖ్యానిస్తున్నారు.
ట్రైలర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. “ఎన్టీఆర్ ఖాతాలో మరో హిట్ పక్కా” అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. టైగర్ vs ట్రేండ్రా? అంటూ ఫ్యాన్స్ ట్రెండింగ్ మేమ్స్ షేర్ చేస్తున్నారు. హృతిక్, ఎన్టీఆర్ మధ్య కాంపిటీషన్ చూస్తేనే థ్రిల్‌గా ఉందని, పూర్తి సినిమా ఎలా ఉంటుందో ఊహించలేకపోతున్నామని కామెంట్లు వస్తున్నాయి. ఈ చిత్రం నవంబర్‌లో విడుదల కానుండగా, అప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. థియేటర్లలో పండగే అని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.