Andhra Pradesh

వాయుగుండం హెచ్చరిక: కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు

తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్: ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ-అతి భారీ వర్షాలు |  Severe cyclonic storm effect: Heavy to very heavy rains in these districts  of AP - Telugu Oneindia

వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడినట్లు భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఈ వాయుగుండం పారాదీప్కు తూర్పు ఈశాన్య దిశగా 190 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా జిల్లాల్లో వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఈ వాయుగుండం కారణంగా తీరం వెంబడి గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని IMD అంచనా వేసింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో కోస్తా ప్రాంత ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. భారీ వర్షాలు, ఈదురుగాలులు స్థానిక జనజీవనంపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో అధికారులు తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version