Health
రాళ్ల ఉప్పు ప్రయోజనాలు: రుచికే కాదు, ఆరోగ్య సమస్యలకూ సింపుల్ హోమ్ ట్రీట్మెంట్!
మన ఇళ్లలో ఎప్పుడూ ఉండే సాధారణ ఉప్పు…ముఖ్యంగా రాళ్ల ఉప్పు అయితే మరీ ప్రత్యేకం. వంటల్లో వేసినా రుచి పెంచుతుంది, కానీ ఇది చేసే ప్రయోజనాలు అంతటితో ఆగిపోవు. ఇంటి శుభ్రత నుంచీ చిన్న చిన్న హెల్త్ సమస్యల వరకు — రాళ్ల ఉప్పు సహజమైన పరిష్కారాన్ని అందిస్తుంది.
నాటి కాలం నుంచే ఎక్కువ ప్రాసెస్ చేయని ఉప్పు అంటే రాళ్ల ఉప్పునే. అందుకే దీనిలోని ఖనిజాల సహజగుణాలు మన ఆరోగ్యానికి కూడా ఉపయుక్తం అవుతాయి. న్యూట్రిషనిస్ట్ శ్వేతా షా సూచించిన విధంగా రాళ్ల ఉప్పు మన రోజువారీ సమస్యలను ఎలా తగ్గించగలదో చూద్దాం.
1. నిద్రలేమికి సహజ రీలీఫ్
రోజంతా ఒత్తిళ్లు, ఆందోళనలు రాత్రివేళ నిద్రపట్టనివారు చాలామంది. అలాంటివారు వేడిగా చేసిన కొద్దిపాటి రాళ్ల ఉప్పుని గుడ్డలో కట్టి మెడపై నెమ్మదిగా ఉంచితే రిలాక్సేషన్ కలుగుతుంది. దీనివల్ల యాంగ్జైటీ తగ్గి నిద్ర సహజంగా వస్తుంది.
2. గొంతు నొప్పి & ఇన్ఫెక్షన్స్కి సింపుల్ టిప్
గోరువెచ్చని నీటిలో రాళ్ల ఉప్పు వేసి పుక్కిలిస్తే గొంతులోని కీటకాలు, ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. గొంతునొప్పి, మంట, స్వర మార్పు వంటి సమస్యలకు ఇది చాలా బాగా పనిచేస్తుంది.
3. ముక్కు దిబ్బడకు తక్షణ ఉపశమనం
చలిపడినా, తేమ తగ్గినా ముక్కు దిబ్బడ సమస్య ఎక్కువ. అలాంటప్పుడు గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి 3–4 చుక్కలు ముక్కులో వేస్తే శ్వాస మార్గాలు క్లియర్ అవుతాయి.
4. ఛాతీ కఫం & దగ్గుకు హోం రీమెడీ
మెడిసిన్‌కి వెళ్లకముందే ఒకసారి ఉప్పు టిప్ ట్రై చేయండి. వేడి చేసిన రాళ్ల ఉప్పుని గుడ్డలో కట్టి ఛాతీపై ఉంచితే పేరుకుపోయిన కఫం సడలుతుంది, దగ్గు తగ్గుతుంది.
5. వాపు & నొప్పి తగ్గించడంలో సహాయకం
ఏదైనా దెబ్బ తగిలి వాపు వచ్చినప్పుడు, చల్లని నీటిలో రాళ్ల ఉప్పు వేసి గుడ్డని ముంచి నొప్పి ప్రాంతంపై ఉంచితే వాపు, నొప్పి రెండూ తగ్గుతాయి.
#RallaUppu #SaltBenefits #HomeRemedies #NaturalHealing #TeluguHealthTips #HealthyLiving #TraditionalRemedies #WellnessTips #NaturalCure #HomeTreatment #TeluguContent #HealthCareTelugu #RalluUppuTips
![]()
