Health
ముడి వంటనూనెపై దిగుమతి సుంకం తగ్గింపు: నూనె ధరల తగ్గింపుకు కేంద్రం చర్యలు
దేశంలో వంటనూనె ధరలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ముడి వంటనూనె దిగుమతిపై విధించే సుంకాన్ని 10 శాతం మేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 27.5 శాతంగా ఉన్న దిగుమతి సుంకం ఇకపై 16.5 శాతానికి సవరించబడింది. ఈ నిర్ణయంతో దేశీయ రిఫైనింగ్ పరిశ్రమలపై సుంకం భారం తగ్గడమే కాకుండా, వంటనూనె ధరలు కూడా దిగివచ్చే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది.
అయితే, రిఫైన్డ్ పామాయిల్, సోయా, సన్‌ఫ్లవర్ ఆయిల్స్‌పై దిగుమతి సుంకం (35.75%)ను కేంద్ర ప్రభుత్వం యథావిధిగా కొనసాగించాలని నిర్ణయించింది. ఈ చర్యలు వినియోగదారులకు ఊరటనిచ్చే అవకాశం ఉన్నప్పటికీ, రిఫైన్డ్ నూనెలపై సుంకం తగ్గింపు లేకపోవడం గమనార్హం