International
భారత్-యూకే ఫ్రీ ట్రేడ్ డీల్‌తో ధరల క్షీణతకు మార్గం
భారత్-యునైటెడ్ కింగ్డమ్ (UK) మధ్య ఫ్రీ ట్రేడ్ ఒప్పందం కుదురుకుంటున్న నేపథ్యంలో పలు దిగుమతి వస్తువులపై సుంకాలు గణనీయంగా తగ్గనున్నాయి. దీని ప్రభావంగా పలు ఉత్పత్తుల ధరలు భారీగా తగ్గే అవకాశముంది.
ప్రత్యేకంగా UKలో తయారయ్యే స్కాచ్, విస్కీ, జిన్ వంటి ఆల్కహాల్ పానీయాలపై ప్రస్తుత 150 శాతం దిగుమతి సుంకం 75 శాతానికి తగ్గనుంది. అంతేగాక, యూకేలో తయారయ్యే జాగ్వార్, ల్యాండ్ రోవర్ కార్లపై ఉన్న 100 శాతం దిగుమతి సుంకం కేవలం 10 శాతానికి పరిమితం కానుంది.
ఇంకా, వైద్య పరికరాలు, ఎలక్ట్రిక్ మెషినరీ, ఆహార ఉత్పత్తులు, కాస్మెటిక్స్ వంటి వస్తువుల ధరలు కూడా డీల్‌తో తక్కువవుతాయని అంచనాలు ఉన్నాయి. దీంతో వినియోగదారులకు మేలు జరగనుండగా, మార్కెట్లో పోటీ కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.