Latest Updates
“భారత్ తరఫున టెస్ట్ ఆడటమే నా పెద్ద డ్రీమ్”: రింకూ సింగ్
భారత క్రికెట్లో రింకూ సింగ్ తన పెద్ద డ్రీమ్ గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ, “భారత్ తరఫున టెస్ట్ క్రికెట్ ఆడటం నా జీవితంలో అతిపెద్ద లక్ష్యం. అవకాశం వస్తే అన్ని ఫార్మాట్లలో రాణించగలను అనే నమ్మకం ఉంది.
నాకు టీ20 స్పెషలిస్ట్ ట్యాగ్ ఇష్టం లేదు. ఒక్క ఫార్మాట్‌కి పరిమితం కావాలనుకోవట్లేదు. నేను సిక్సులు కొడితే ఫ్యాన్స్ ఇష్టపడతారని తెలుసు. కానీ రంజీ క్రికెట్లో కూడా నా సగటు 55తో బాగుంది. రెడ్ బాల్ క్రికెట్ ఆడటాన్ని నిజంగా ఆస్వాదిస్తున్నాను” అని చెప్పారు.