International
భారత్‌లో స్టార్ లింక్ ఇంటర్నెట్ సేవలకు కేంద్రం ఆమోదం
శాటిలైట్ ద్వారా హై-స్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందించే ఎలాన్ మస్క్ స్థాపించిన స్టార్ లింక్ సంస్థకు భారత కేంద్ర ప్రభుత్వం లైసెన్స్ మంజూరు చేసింది. ఈ నిర్ణయంతో భారత్‌లో స్టార్ లింక్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) త్వరలోనే స్టార్ లింక్‌కు స్పెక్ట్రమ్ కేటాయింపులు చేయనుంది. భారత్‌లో సేవలు అందించేందుకు స్టార్ లింక్ సంస్థ భద్రతా ప్రమాణాలను పాటించడంపై కేంద్ర ప్రభుత్వం సంతృప్తి వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఇప్పటికే తన సేవలను విజయవంతంగా అందిస్తున్న స్టార్ లింక్, భారత్‌లోనూ తన విస్తరణకు సిద్ధమైంది.
భారత్‌లో వన్ వెబ్ మరియు జియో సంస్థల తర్వాత శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు లైసెన్స్ పొందిన మూడో సంస్థగా స్టార్ లింక్ నిలిచింది. ఈ లైసెన్స్‌తో దేశంలోని మారుమూల ప్రాంతాల్లోనూ అత్యాధునిక ఇంటర్నెట్ సేవలను అందించేందుకు స్టార్ లింక్‌కు అవకాశం లభించనుంది. ఈ చర్య భారత్‌లో డిజిటల్ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా పరిగణించబడుతోంది.