Latest Updates
బీజేపీ నా ఇల్లు… పిలిస్తే వెంటనే వస్తా: రాజా సింగ్
హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తన రాజకీయ భవిష్యత్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీకి మాత్రమే రాజీనామా చేశానని, ఎమ్మెల్యేగా కొనసాగుతున్నానని స్పష్టం చేశారు. “బీజేపీ నా ఇల్లు… పార్టీ అధిష్ఠానం పిలిస్తే వెంటనే తిరిగి వెళ్తా. నన్ను బీజేపీ ఎమ్మెల్యేగానే పరిగణించొచ్చు” అని రాజా సింగ్ వెల్లడించారు.
తనపై కొన్ని తప్పులున్నాయని అంగీకరించిన ఆయన, వేరే పార్టీలకు తాను సరిపోడని చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గోషామహల్ నియోజకవర్గానికి ఉపఎన్నిక రాదన్న నమ్మకాన్ని ఆయన వెలిబుచ్చారు.