Education
బీజేపీలో గ్రూప్ ఫైటింగ్ తో రాజకీయ టెన్షన్ పెరిగింది!
తెలంగాణలో బీజేపీ అంతర్గత గందరగోళం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నాయకులు ఒకరిపై మరొకరు మాటల యుద్ధానికి దిగుతున్నారు. “నువ్వెంత?” అని ఎగతాళిగా మాట్లాడుకుంటూ నేతలు ఒకరినొకరు ఉద్దేశించి విమర్శలు చేస్తుండటం పార్టీలో చిచ్చు రేపుతోంది. పేర్లు ప్రస్తావించకుండా బండి సంజయ్, ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేయడం బీజేపీ వర్గాల్లో కలకలం రేపుతోంది.