Entertainment

బిగ్‌బాస్ 9 అప్‌డేట్: అనారోగ్యంతో అయేషా ఔట్.. వాలంటరీ ఎలిమినేషన్ షాక్!

బిగ్‌బాస్ 9 తెలుగు సీజన్‌లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. వైల్డ్‌కార్డ్ ఎంట్రీగా వచ్చిన కంటెస్టెంట్ అయేషా జీనత్ హౌస్ నుంచి బయటికి వచ్చినట్లు సమాచారం. అనారోగ్య సమస్యల కారణంగా ఆమెను ట్రీట్‌మెంట్ కోసం బిగ్‌బాస్ హౌస్‌ నుంచి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అయేషా హెల్త్‌ కండిషన్‌ డీహైడ్రేషన్ వల్ల బలహీనంగా ఉందని ఆమె టీమ్ సోషల్ మీడియాలో వెల్లడించింది.

ఆమె టీమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో “అయేషా ప్రెజెన్స్‌ని మేము చాలా మిస్ అవుతున్నాం. ఆమె యాక్టివ్‌గా ఉండేది కానీ ప్రస్తుతం ఆరోగ్య సమస్యల కారణంగా విశ్రాంతి తీసుకుంటుంది. త్వరలోనే పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాం” అని పోస్ట్ చేసింది. డాక్టర్స్ నుంచి అనుమతి లభిస్తే మళ్లీ హౌస్‌లోకి రీ-ఎంట్రీ చేసే అవకాశం ఉందని సమాచారం. లేకపోతే ఈ వారం శనివారం ఎపిసోడ్‌లో ఆమె వాలంటరీ ఎలిమినేషన్ జరిగే అవకాశం ఉందని బిగ్‌బాస్ వర్గాలు చెబుతున్నాయి.

అయేషా బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన మొదటి వారం నుంచే తన మాటలతో అందరినీ ఆకట్టుకుంది. తనూజని నామినేట్ చేస్తూ రిలేషన్‌షిప్స్ గురించి చెప్పిన పాయింట్లు ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యాయి. కానీ ఇటీవల రీతూ చౌదరిని నామినేట్ చేసినప్పుడు ఆమె ప్రవర్తన, వ్యక్తిగత వ్యాఖ్యలు మాత్రం నెటిజన్ల విమర్శలకు గురయ్యాయి. ఆ తర్వాత ఎపిసోడ్స్‌లో ఆమె పెద్దగా కనిపించకపోవడంతో అభిమానుల్లో అనుమానాలు మొదలయ్యాయి.

తమిళనాడుకి చెందిన అయేషా పలు సీరియల్స్‌, సినిమాల్లో నటించి, తమిళ బిగ్‌బాస్‌లో కూడా పాల్గొంది. తెలుగు ప్రేక్షకులకి ఆమె “ఊర్వశివో రాక్షసివో” సీరియల్ ద్వారా పరిచయం. అలాగే “కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్” షోలో కూడా పాల్గొంది. ప్రస్తుతం బిగ్‌బాస్ 9లో ఆమె ఆటలో పెద్దగా కనిపించకపోయినా గొడవల్లో మాత్రం బిగ్‌బాస్ ఫ్యాన్స్‌కి గుర్తుండిపోయేలా చేసింది. మరి ఆమె తిరిగి హౌస్‌లోకి వస్తుందా లేక వాలంటరీ ఎలిమినేషన్ జరుగుతుందా అనేది చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version