Entertainment
‘బాహుబలి ది ఎపిక్’ రన్‌టైమ్‌పై స్పందించిన రానా
యస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మహత్తర ప్రాజెక్టులు ‘బాహుబలి: ది బిగినింగ్’ మరియు ‘బాహుబలి 2: ది కన్‌క్లూషన్’ను మిక్స్ చేసి ఒకే సినిమాగా రూపొందించిన ‘బాహుబలి ది ఎపిక్’ అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నిడివి (రన్‌టైమ్)పై వస్తున్న పుకార్లపై నటుడు రానా దగ్గుబాటి స్పందించారు.
“ఈ ఏడాది నేను నటించకుండానే నాకు బ్లాక్‌బస్టర్ వచ్చేస్తోంది, అందులోనే నాకు ఆనందం. అసలు రన్‌టైమ్ ఎంతనో నాకు కూడా చెప్పలేదు,” అని రానా హస్యంగా స్పందించారు. “ఒకవేళ నాలుగు గంటలైనా చూసేవారా, వద్దా అన్నదాన్ని రాజమౌళిగారే నిర్ణయిస్తారు,” అని ఆయన స్పష్టం చేశారు. రన్‌టైమ్‌పై అనేక ఊహాగానాలు నడుస్తున్నప్పటికీ, మేకర్స్ అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.