Latest Updates

బాల్క సుమన్‌కు బెయిల్ మంజూరు: 14 రోజుల తర్వాత జైలు నుంచి విడుదల.. కోర్టు విధించిన షరతులేంటంటే?

క్యాతన్‌పల్లి ఘటనలో అరెస్టయి ఆదిలాబాద్ జైలులో ఉన్న బాల్క సుమన్‌కు మంచిర్యాల జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రాజకీయంగా పెను దుమారం రేపిన ఈ కేసులో సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.

ఫిబ్రవరి 18న క్యాతన్‌పల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా మంత్రి గడ్డం వివేక్, ఎంపీ వంశీల కాన్వాయ్‌పై దాడి జరిగినట్లు బాల్క సుమన్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో జరిగిన గొడవలో వాహనాల అద్దాలు ధ్వంసం కావడంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు,కోర్టు ఆదేశాల మేరకు గత రెండు వారాలుగా ఆయన ఆదిలాబాద్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

 బాల్క సుమన్‌తో పాటు మరో ముగ్గురికి బెయిల్ ఇస్తూనే కోర్టు కొన్ని కఠిన నిబంధనలు విధించింది. బెయిల్‌పై విడుదలైన తర్వాత వీరు ప్రతి ఆదివారం రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు,ఈ ఘటనతో మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పోలీసుల విధులకు అడ్డుతగిలారన్న ఫిర్యాదుతో పాటు, కాంగ్రెస్ నేతలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు బాల్క సుమన్‌పై కేసులు నమోదయ్యాయి. బెయిల్ లభించడంతో బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version