Business
బంగారం ధరలు క్షీణత: వినియోగదారులకు ఊరట
బంగారం ధరలు ఇవాళ కాస్త తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.820 తగ్గి ₹99,870కు చేరుకుంది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం రూ.750 తగ్గి ప్రస్తుతం 10 గ్రాములకు ₹91,550గా నమోదైంది.
మరోవైపు వెండి ధరలు కూడా పడిపోయాయి. కిలో వెండిపై రూ.1,000 తగ్గి ఇప్పుడు రూ.1,19,000కి చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే తరహాలో బంగారం, వెండి ధరలు కొనసాగుతున్నాయని జెవెలరీ వ్యాపారులు తెలిపారు. పెళ్లిళ్ల సీజన్‌కు ముందు వచ్చిన ఈ ధరల తగ్గుదల వినియోగదారులకు ఊరటనిస్తుందని అంటున్నారు