Andhra Pradesh
పుష్ప’ డైలాగు పెట్టినా తప్పేనా?: జగన్ ప్రశ్న
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, ఇటీవల జరిగిన పోస్టర్ వివాదంపై స్పందించారు. సత్తెనపల్లి పర్యటన సందర్భంగా “రప్పా రప్పా నరుకుతాం” అనే డైలాగుతో ఉన్న పోస్టర్‌ను ప్రదర్శించిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేయడం వివాదాస్పదమైంది. దీనిపై మీడియా సమావేశంలో జగన్ స్పందిస్తూ, “‘పుష్ప’ సినిమాలోని డైలాగులు పెట్టినా తప్పేనా? మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా?” అంటూ ప్రశ్నించారు.
ఆ యువకుడికి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉన్నప్పటికీ, చంద్రబాబుపై ఉన్న ఆగ్రహంతో తమ అభిమానిగా మారి అలాంటి పోస్టర్ పట్టుకున్నాడని తెలిపారు. ప్రజల భావప్రకటన స్వేచ్ఛకు ఇది ఉదాహరణగా నిలవాలన్నారు. జగన్ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీశాయి