Entertainment
పవన్ కళ్యాణ్ హీరోయిన్ ఇలా మారిపోయిందా?
ఒకప్పుడు ‘పంజా’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చి మెరిసిన సారా జేన్ డయాస్.. ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. 2011లో వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమా పంజా గుర్తుందా? అందులో సారా హీరోయిన్గా కనిపించింది. అప్పట్లో కాస్త బొద్దుగా ఉండే సారా.. అప్పట్లో తెలుగు ప్రేక్షకులకు కొత్త ముఖమే అయినా, తన గ్లామర్‌తో ఆకట్టుకుంది.
అయితే ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో తెలుగులో మళ్లీ అవకాశాలు రాలేదు. తెలుగు తెరపై ఆమె ప్రయాణం అక్కడితో ముగిసిపోయినట్టే అనిపించింది. కానీ సారా మాత్రం అక్కడే ఆగలేదు. మళ్లీ తనలోని నటీనటిగా ఉన్న ప్రతిభను చూపించుకోవాలని, కెరీర్‌ని కొత్తగా ప్రారంభించాలని నిశ్చయించుకుంది.
తెలుగు తెరపై కనిపించకపోయినా.. హిందీలో మాత్రం వెబ్‌సిరీస్‌లు, మోడలింగ్ ప్రాజెక్టులతో బిజీగా మారిపోయింది. పంజా సినిమాలో కనిపించిన సారా, ఇప్పుడు చూస్తే మాత్రం పూర్తిగా ట్రాన్స్‌ఫార్మ్ అయిపోయిందని చెప్పొచ్చు. అప్పటి ముద్దుగా ఉండే లుక్కు బదులుగా ఇప్పుడు ఫిట్‌నెస్‌పై ఎక్కువ దృష్టి పెట్టి.. ట్రెండీ లుక్‌లో గ్లామరస్ అవతారంలో దర్శనమిస్తుంది.
ఇటీవల ఆమె షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మోడరన్ లుక్‌లో సారా కనపడడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. “అంటే ఇదేనా పంజాలో వచ్చిన హీరోయిన్..? ఇలా మారిపోయిందా?” అని కామెంట్లు పెడుతున్నారు. ఫ్యాషన్, ఫిట్నెస్, మోడలింగ్.. ఈ మూడు రంగాల్లో దూసుకుపోతున్న సారా ఇప్పుడు బాలీవుడ్‌లోనూ తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంటోంది.