Latest Updates

నీటి సంరక్షణకు చిహ్నంగా ‘సిందూర్’ మొక్క నాటిన ప్రధాని మోదీ

PM Modi: జాతీయ వీరత్వానికి చిహ్నంగా సింధూరం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు |  Sindoor Symbolizes Women Power and National Bravery PM Modi in Bhopal sriప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ‘సిందూర్’ మొక్కను నాటారు. ‘ఏక్ పేడ్ మాకే నామ్’ కార్యక్రమం రెండో దశలో భాగంగా దేశవ్యాప్తంగా 10 కోట్ల మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రజలను చైతన్యం చేయడం, వృక్షసంపదను పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. సిందూర్ మొక్క, నీటి సంరక్షణకు చిహ్నంగా గుర్తింపబడుతుంది. ఈ సందర్భంగా ప్రధాని, పర్యావరణ సమతుల్యత కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని కోరారు.

ఇటీవల గుజరాత్ పర్యటనలో ఉండగా, 1971 ఇండో-పాక్ యుద్ధంలో సాహసం ప్రదర్శించిన మహిళలు ప్రధాని మోదీని కలిసి సిందూర్ మొక్కను బహూకరించారు. ఆ మొక్కను తన నివాసంలో నాటుతానని హామీ ఇచ్చిన ప్రధాని, పర్యావరణ దినోత్సవం రోజున ఆ మాటను నిలబెట్టారు. ఈ కార్యక్రమం ద్వారా పర్యావరణంపై అవగాహన పెంచడంతో పాటు, యుద్ధంలో వీరత్వం చాటిన మహిళల స్ఫూర్తిని కూడా గౌరవించారు. సిందూర్ మొక్క నాటడం ద్వారా నీటి సంరక్షణ, పచ్చదనం పెంపొందించడంపై ప్రధాని మోదీ తన నిబద్ధతను చాటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version