News

నల్లమల నుంచి మాట్లాడుతుంటే నా గుండె ఉప్పొంగుతోంది: సీఎం

Taken out of context': Telangana CM Revanth Reddy apologises for remark on  Kavitha bail order | India News - Times of India

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్లమల నుంచి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతంగా ఉన్న నల్లమల, ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయని ఆయన ప్రకటించారు. సీఎంగా నల్లమల నుంచి మాట్లాడుతుంటే తన గుండె ఉప్పొంగిపోతోందని భావోద్వేగంతో చెప్పారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ఈ ప్రాంత ప్రజల రుణం తప్పక తీర్చుకుంటామని హామీ ఇచ్చారు.

నల్లమల డిక్లరేషన్ ద్వారా ఆదివాసీలు, బంజారాలు, చెంచులకు ప్రత్యేక ప్రయోజనాలు చేకూరనున్నాయని సీఎం వెల్లడించారు. అంతేకాదు, సోలార్ విద్యుత్‌తో పాటు ఈ ప్రాంత ప్రజలకు ఆదాయ మార్గాలను కూడా సమకూర్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపாரు. నల్లమల ప్రాంత అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version