Andhra Pradesh

తిరుమలలో రథసప్తమి ఎఫెక్ట్.. మూడు రోజులు దర్శన టోకెన్లు కట్

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ముఖ్యమైన సూచనలు ఇచ్చింది. ఈ నెల 25న రథసప్తమి పండుగ జరుగుతుంది. అందుకే ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ చెప్పింది. భక్తుల భద్రత, సౌకర్యాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

రథసప్తమి రోజున కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు జరుగుతాయి. అయితే ఎన్‌ఆర్‌ఐలు, సీనియర్ సిటిజన్లు, వికలాంగులు, చంటి బిడ్డల తల్లిదండ్రులకు ప్రివిలేజ్ దర్శనాలు ఉండవు. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. జనవరి 24 నుంచి 26 వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేశారు.

భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్నప్రసాదాలు, భద్రత, వైద్య సేవలపై ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. అదనంగా 5 లక్షల లడ్డూల బఫర్ స్టాక్, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సదుపాయాలు, మాక్ డ్రిల్ నిర్వహణకు ఆదేశాలు జారీ చేసింది. రథసప్తమి వేడుకలను భక్తిశ్రద్ధలతో, సవ్యంగా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించింది. 🙏

రథసప్తమి వాహన సేవల షెడ్యూల్:

తెల్లవారుజామున 5.30 – 8.00 : సూర్యప్రభ వాహనం

ఉదయం 9.00 – 10.00 : చిన్నశేష వాహనం

ఉదయం 11.00 – మధ్యాహ్నం 12.00 : గరుడ వాహనం

మధ్యాహ్నం 1.00 – 2.00 : హనుమంత వాహనం

మధ్యాహ్నం 2.00 – 3.00 : చక్రస్నానం

సాయంత్రం 4.00 – 5.00 : కల్పవృక్ష వాహనం

సాయంత్రం 6.00 – 7.00 : సర్వభూపాల వాహనం

రాత్రి 8.00 – 9.00 : చంద్రప్రభ వాహనం

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని టీటీడీ మరోసారి స్పష్టం చేసింది.

#TTD#TirumalaUpdates#DarshanCancelled#ArjithaSevalu#BhakthulaSaukaryam#AnnaPrasadam#ChakraSnanam#VahanaSeva
#TirumalaTemple#DevotionalNews#APNews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version