Andhra Pradesh
తిరుమలలో ప్లాస్టిక్ ఇస్తే రూ.5!
AP: ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించేందుకు తిరుమల పీఏసీ-5లో రీసైక్లింగ్ యంత్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ Reklaim Ace యంత్రం పనితీరును అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి నిన్న పరిశీలించారు. భక్తులు ఈ యంత్రంలో టెట్రా ప్యాక్స్, స్నాక్స్ ప్యాకెట్లు వదిలివేయవచ్చని, అందుకోసం UPI ద్వారా లాగిన్ అయ్యి QR కోడ్ స్కాన్ చేయాలని అధికారులు తెలిపారు. రింగ్‌లో ప్లాస్టిక్ వదిలివేసే వారికి రూ.5 ప్రోత్సాహకంగా లభిస్తుందన్నారు.
Continue Reading