Andhra Pradesh
చెవిరెడ్డిని అడ్డుకున్న బెంగళూరు పోలీసులు – లిక్కర్ కేసులో లుకౌట్ నోటీసు నేపథ్యం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బెంగళూరు విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్నారు. ఆయన కొలంబోకి ప్రయాణించేందుకు బయల్దేరగా, ఇప్పటికే జారీ చేసిన లుకౌట్ నోటీసుల నేపథ్యంలో పోలీసులు ఆయనను విమాన ప్రయాణం నుంచి నిలిపివేశారు.
సమాచారం ప్రకారం, చెవిరెడ్డి లిక్కర్ కుంభకోణం కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు. ఆ కేసులోనే ఆయనపై లుకౌట్ నోటీసులు అమలులో ఉన్నాయని అధికారులు వెల్లడించారు. దీంతో, ఆయన ప్రయాణాన్ని రద్దు చేసుకొని వెనుదిరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది