Andhra Pradesh
చంద్రబాబు సంచలన ప్రకటన.. వారికి నేరుగా రూ.100 కోట్ల ప్రోత్సాహకం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన టెక్నాలజీ విజన్‌తో దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపారు. గతంలో ఐటీ విప్లవానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు. ఇప్పుడు క్వాంటం టెక్నాలజీని రాష్ట్ర అభివృద్ధికి ప్రధాన అస్త్రంగా మార్చాలని భావిస్తున్నారు. ఈ దిశగా మంగళవారం టెక్ విద్యార్థులతో ఆన్
క్వాంటం టెక్నాలజీ రంగంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైనా నోబెల్ బహుమతి సాధిస్తే, వారికి రూ.100 కోట్ల నగదు ప్రోత్సాహకం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చంద్రబాబు ప్రకటించారు. ఇది కేవలం బహుమతి మాత్రమే కాదని, యువతలో పరిశోధనాత్మక ఆలోచనలను ప్రోత్సహించే పెద్ద అడుగుగా ఆయన పేర్కొన్నారు.
అమరావతి క్వాంటం వ్యాలీకి కేంద్రబిందువు
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ. రాబోయే రోజుల్లో క్వాంటం కంప్యూటింగ్ అన్ని రంగాల్లో కీలక పాత్ర పోషించనుందని అన్నారు. అందుకు అనుగుణంగా అమరావతిలో క్వాంటం వ్యాలీని ఆధునిక పరిశోధనలకు కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ తరహాలో, ప్రపంచ స్థాయి క్వాంటం పరిశోధనలకు అమరావతిని హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని స్పష్టం చేశారు.
భారతదేశంలో క్వాంటం టెక్నాలజీ విప్లవానికి ఆంధ్రప్రదేశ్ నాయకత్వం వహిస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. క్వాంటం టెక్నాలజీతో పాటు దాని అనుబంధ రంగాల్లో 14 లక్షల మంది నిపుణులను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. విద్య, పరిశ్రమ, పరిశోధన రంగాల మధ్య సమన్వయంతో యువతకు ప్రపంచ స్థాయి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.
చంద్రబాబు పారిశ్రామిక అభివృద్ధిపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నాన్ని నాలెడ్జ్ ఎకానమీకి కేంద్రంగా, ఏఐ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ క్రమంలోనే విశాఖకు పలు ఐటీ కంపెనీలను తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో స్పేస్ సిటీ ఏర్పాటు కోసం కూడా ప్రభుత్వం ముందడుగు వేస్తోందని తెలిపారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ రంగానికి బలమైన పునాది వేసిన చంద్రబాబు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం టెక్నాలజీపై ప్రత్యేక దృష్టి పెట్టారు. జాతీయ, అంతర్జాతీయ టెక్నాలజీ మార్పులకు అనుగుణంగా ఏపీ విద్యార్థులను సిద్ధం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వ ప్రణాళికలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ క్రమంలోనే అమరావతిలో క్వాంటం వ్యాలీని వచ్చే ఏడాదిలో ప్రారంభించేందుకు చర్యలు చేపట్టినట్లు సీఎం వెల్లడించారు.
#ChandrababuNaidu#QuantumTalk#QuantumTechnology#QuantumValley#Amaravati#APQuantumHub#NobelPrizeOffer
#FutureTechnology#AIAndQuantum#TechStudents#AndhraPradesh#KnowledgeEconomy#VizagAIHub#TirupatiSpaceCity