Connect with us

Latest Updates

కాళేశ్వరం నివేదికపై అసెంబ్లీలో చర్చకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ – దర్యాప్తుకు మార్గం సిద్ధం

'కాళేశ్వరం' నివేదికలపై కదలిక - చర్యలకు సిద్ధమవుతున్న సర్కార్

కాళేశ్వరం ప్రాజెక్టును విచారణకు తీసుకునే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. PC ఘోష్ నేతృత్వంలోని కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చ నిర్వహించాలని రాష్ట్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది.

ఈ చర్చ అనంతరం ప్రాజెక్టు లోపాలపై మరింత లోతైన దర్యాప్తు కోసం సిట్ లేదా సీబీఐ విచారణ కోరే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు సూచిస్తున్నాయి. ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని పారదర్శకంగా, న్యాయంగా పరిష్కరించాలన్న దిశగా అడుగులు వేస్తోంది.

ఇక సమావేశంలో కమిషన్ నివేదికలోని ముఖ్యాంశాలను సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు వివరించారు. కాసేపట్లో జరగనున్న ప్రెస్‌మీట్‌లో ప్రజలకు నివేదిక అంశాలు, ప్రభుత్వ వైఖరిపై స్పష్టతనివ్వనున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు హాట్ టాపిక్‌గా మారనున్నాయని, అధికార, విపక్ష మధ్య తీవ్ర స్థాయిలో చర్చ జరిగే అవకాశముందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *