Agriculture
ఏపీ రైతులకు అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం, వెంటనే నమోదు చేసుకోండి

ఆంధ్రప్రదేశ్ రైతులకు మరోసారి ప్రభుత్వం శుభవార్తను అందించింది. రబీ సీజన్లో ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయినా, రైతులు ఇబ్బందులు పడకుండా ఆర్థిక రక్షణ కల్పించేందుకు రాష్ట్రం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY), వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాలను వేగంగా అమలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే జిల్లా వారీగా ప్రత్యేక చర్యలు ప్రారంభించారు.
ఈ పథకాల కింద పంట దిగుబడి అంచనాలు, పంట కోత ప్రయోగాలు వంటి వివరాలు సేకరించి, రైతులు చెల్లించిన ప్రీమియం ఆధారంగా నష్టపరిహారం అందజేయబడుతుంది. పంట నష్టాల్లో రైతులకు ఇది గొప్ప ఆర్థిక ఆదరంగా నిలుస్తుంది.
పంటల వారీగా ప్రీమియం చెల్లింపు ముఖ్య తేదీలు
వరి (Paddy)- ప్రీమియం చెల్లించడానికి చివరి తేదీ డిసెంబర్ 31
వేరుసెనగ (Groundnut)- డిసెంబర్ 15 లోపు ప్రీమియం చెల్లించాలి
టమాటా (Tomato) – రిజిస్ట్రేషన్ & ప్రీమియం చివరి తేదీ డిసెంబర్ 15
మామిడి (Mango) – ప్రీమియం చివరి తేదీ జనవరి 3
భారీ వర్షాలు, వరదలు, కరువు, గాలివానలు వంటి ప్రకృతి మార్పుల వలన పంటలు దెబ్బతిన్నప్పుడు, ఈ బీమా రైతులకు పెద్ద రక్షణగా నిలుస్తుందని అధికారులు సూచిస్తున్నారు. రైతులు వీలైనంత త్వరగా నమోదు చేసుకుని బీమా ప్రయోజనాలను పొందాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
రబీ సీజన్‌కు భారీ విడుదల
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ. 44.06 కోట్లు ముందస్తు ప్రీమియం సబ్సిడీగా ఎస్క్రో ఖాతాలో జమ చేయడానికి అమోదించింది. ఇది మొత్తం సబ్సిడీకి 50% సమానం. రబీ సీజన్లో ఈ నిధులు విడుదల చేయడంతో రైతులు తక్కువ భారం తోనే బీమా పొందే అవకాశం కలిగింది.
రైతులకు ప్రభుత్వం సూచనలు
సమయానుసారంగా ప్రీమియం చెల్లించాలి.
మీ రైతు సేవా కేంద్రం (RBK) లో పూర్తిస్థాయి సహాయం అందుబాటులో ఉంటుంది.
పథకాలు పంట నష్టాన్ని తగ్గించడానికి, ఆర్థిక స్థిరత్వం కోసం ఎంతో మేలు చేస్తాయి.
#APGovt #CropInsurance #PMFBY #RabiSeason #AndhraPradeshFarmers #FarmersSupport #AgricultureNews #WeatherBasedInsurance #PantaBima #APFarmers #AgricultureUpdates #FarmerWelfare #PantaBimaApply #VillageAgriculture #FarmInsurance