Andhra Pradesh

ఏపీ ప్రభుత్వంపై సినీ పరిశ్రమ మర్యాద చూపడం లేదా?: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం

టాలీవుడ్ తీరుపై పవన్ ఫైర్..! రిటర్న్ గిఫ్ట్ కు థ్యాంక్స్..! ఇక దబిడి  దిబిడే..! | pawan kalyan's satires on Tollywood for theatres closure return  gift before his movie release - Telugu Oneindia

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టాలీవుడ్ పరిశ్రమ అభివృద్ధికి అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, సినీ ప్రముఖులు ప్రభుత్వం పట్ల తగిన మర్యాద చూపడం లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాల విడుదల సమయంలో వ్యక్తిగతంగా అర్జీలు సమర్పించి, టికెట్ ధరలు పెంచాలని కోరడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. సినీ పరిశ్రమ ప్రతినిధులంతా కలిసి వచ్చి ప్రభుత్వంతో చర్చలు జరపాలని తాను గతంలో కోరినప్పటికీ, ఎవరూ స్పందించలేదని ఆయన విచారం వ్యక్తం చేశారు.

కూటమి ప్రభుత్వం వ్యక్తులను చూడకుండా, నిష్పక్షపాతంగా పనులు చేస్తోందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. నాగార్జున కుటుంబానికి చెందిన చిత్రం విడుదలైన సమయంలో కూడా ప్రభుత్వం తమవంతు ప్రోత్సాహం అందించిందని ఆయన పేర్కొన్నారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నప్పటికీ, సినీ ప్రముఖులు సహకరించడం లేదని, ఇది తగిన పరిష్కార మార్గాల కోసం సమిష్టిగా చర్చించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version