Entertainment
ఎన్టీఆర్ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు ఒక చిన్న నిరాశ కలిగించే వార్త ఇది. దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్టీఆర్-నీల్ కాంబినేషన్ సినిమా గురించి ఎప్పటి నుంచో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి బర్త్ డే స్పెషల్ గ్లింప్స్ రావాలంటూ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. కానీ తాజాగా మేకర్స్ ఓ కీలక ప్రకటన చేశారు. “డియర్ ఫ్యాన్స్.. మీ ఆసక్తిని మేము పూర్తిగా అర్థం చేసుకోగలుగుతున్నాం. అయితే ఈ ఏడాది ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మేము ఎలాంటి గ్లింప్స్ ఇవ్వడం లేదు. అదే రోజున ఎన్టీఆర్ నటిస్తున్న మరో భారీ చిత్రం ‘వార్ 2’ నుంచి ఒక స్పెషల్ గ్లింప్స్ విడుదలవుతోంది. అందుకే మేము గ్లింప్స్ విడుదల చేయకూడదని నిర్ణయించుకున్నాం” అంటూ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
ఈ నెల 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్బంగా ఆయన నటిస్తున్న చిత్రాలపై అభిమానుల ఆశలు ఎంతో ఉన్నాయ్. కానీ ‘వార్ 2’ ప్రమోషనల్ కంటెంట్ రావడం వల్ల ఎన్టీఆర్-నీల్ మూవీ నుంచి ఏమైనా వస్తుందా అన్న ఆసక్తి తాత్కాలికంగా మిగిలిపోయింది. అయితే నిర్మాతలు తెలియజేశారు – ఫ్యాన్స్ కోసం ఒక మంచి గ్లింప్స్‌ను సరైన సమయంలో విడుదల చేస్తామంటూ. ఇది చూసినవారికి కొద్దిగా నిరాశ కలగొచ్చినా, ఎట్టిపరిస్థితిలోనూ సినిమా మీద ఉన్న అంచనాలు మాత్రం తగ్గేలా లేవు. ఎన్టీఆర్ అభిమానులు మరికొన్ని రోజులు ఓపిగ్గా ఎదురు చూడాల్సిందే.