Job Alerts

ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారికి శుభవార్త.. 859 ఖాళీల భర్తీ.. రూ.96 వేల ప్యాకేజీ

తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కోర్టుల్లో ఖాళీగా ఉన్న 859 పోస్టుల భర్తీకి తెలంగాణ హైకోర్టు (TGHSC) అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆఫీస్ సబార్డినేట్ నుంచి స్టెనోగ్రాఫర్ వరకు వివిధ విభాగాల్లో నియామకాలు చేపట్టనున్నారు.

ఈ నోటిఫికేషన్ వల్ల ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఆశలు కలిగాయి. అర్హత ఉన్నవారు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 13 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

🔹 పోస్టుల వివరాలు

ఆఫీస్ సబార్డినేట్ – 319

జూనియర్ అసిస్టెంట్ – 159

ప్రాసెస్ సర్వర్ – 95

కాపిస్ట్ – 63

ఫీల్డ్ అసిస్టెంట్ – 61

ఎగ్జామినర్ – 49

టైపిస్ట్ – 42

రికార్డ్ అసిస్టెంట్ – 36

స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3 – 35

మొత్తం ఖాళీలు: 859

🔹 అర్హతలు

పోస్టును బట్టి 7వ తరగతి, 10వ తరగతి, ఇంటర్ లేదా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి. కొన్ని పోస్టులకు ఇంగ్లిష్ టైపింగ్, షార్ట్‌హ్యాండ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది.

🔹 వయోపరిమితి

18 నుంచి 46 సంవత్సరాల లోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వ్డ్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.

🔹 జీతం వివరాలు

స్టెనోగ్రాఫర్: రూ.32,810 – రూ.96,890

జూనియర్ అసిస్టెంట్ / టైపిస్ట్ / ఫీల్డ్ అసిస్టెంట్: రూ.24,280 – రూ.72,850

ఎగ్జామినర్ / కాపిస్ట్ / ప్రాసెస్ సర్వర్: రూ.22,900 – రూ.69,150

రికార్డ్ అసిస్టెంట్: రూ.22,240 – రూ.67,300

ఆఫీస్ సబార్డినేట్: రూ.19,000 – రూ.58,850

🔹 దరఖాస్తు ఫీజు

జనరల్, బీసీ అభ్యర్థులకు: రూ.600

ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ, ఈఎస్‌ఎం అభ్యర్థులకు: రూ.400

🔹 ఎంపిక విధానం

అభ్యర్థులను సీబీటీ రాత పరీక్షతో పాటు అవసరమైన చోట స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. పరీక్షను 2026 ఏప్రిల్ నెలలో నిర్వహించనున్నారు.

ఈ నోటిఫికేషన్‌తో రాష్ట్రంలోని వేలాది నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగం సాధించే మంచి అవకాశం లభించినట్టయింది.

#TGHSCNotification#859Jobs#GovtJobsTelangana#TelanganaUnemployment#CourtJobs#JobNotification2026#TSJobs#SarkariNaukri

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version