International
ఇజ్రాయెల్ దాడులను ఖండించాలి: భారత్‌ను కోరిన ఇరాన్
ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను భారత్ తీవ్రంగా ఖండించాలంటూ ఇరాన్ విజ్ఞప్తి చేసింది. ఢిల్లీలోని ఇరాన్ ఎంబసీ మిషన్ డిప్యూటీ చీఫ్ జావెద్ హోస్సేనీ మాట్లాడుతూ, “ఇది ఇరాన్‌తో ఉన్న సంబంధాల పరంగా కాకుండా, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించిన ఇజ్రాయెల్ చర్యలపై స్పందనగా చూడాలి” అని వ్యాఖ్యానించారు.
భారత్ గ్లోబల్ సౌత్‌కి నాయకత్వం వహిస్తున్న దేశమని గుర్తుచేస్తూ, న్యూఢిల్లీ ఇజ్రాయెల్ చర్యలను వ్యతిరేకించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇరాన్‌కు నష్టం కలిగితే, అది ప్రపంచంలోని ఇతర దేశాలపై కూడా ప్రభావం చూపుతుందని హెచ్చరించారు.