Latest Updates
ఇండిగో విమానాల్లో అవాంఛనీయ ఘటనలు: ఓ దానికి కుదుపులు, మరో దానికి బాంబు బెదిరింపు
విమానయాన రంగంలో సంభవిస్తున్న ఘటనలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా, ఇండిగోకి చెందిన రెండు విమానాల్లో రెండు విభిన్న సంఘటనలు చోటు చేసుకున్నాయి. గోవా నుంచి లక్నోకి వెళ్తున్న ఇండిగో విమానంలో మధ్యాహ్న సమయంలో తీవ్ర కుదుపులు రావడంతో ప్రయాణికులు భయబ్రాంతులకు లోనయ్యారు. ఆ సమయంలో విమానంలో ఉన్న ఓ జర్నలిస్టు తీసిన సెల్ఫీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక మరోవైపు, మస్కట్-కొచ్చి-ఢిల్లీ విమానం (ఫ్లైట్ నం. 6E 2706) కు బాంబు బెదిరింపు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సదరు విమానాన్ని నాగ్పూర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ప్రయాణికులను సురక్షితంగా బయటకు తరలించగా, బాంబు స్క్వాడ్, పోలీస్ దళాలు తనిఖీలు చేపట్టాయి. ఈ ఘటనల నేపథ్యంలో విమానయాన సంస్థలు భద్రత చర్యలను మరింత బలోపేతం చేస్తున్నాయి.