Latest Updates
ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్లోని ఘట్కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. యమ్నంపేట రైల్వే బ్రిడ్జి సమీపంలో రైలు కింద పడి రాజేందర్ అనే ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.
యాదాద్రి జిల్లా మోత్కూర్ మండలం మానాయిగూడెంకు చెందిన రాజేందర్, యమ్నంపేటలో ఉన్న SCDD హాస్టల్లో ఉండి, స్థానిక శ్రీనిధి యూనివర్సిటీలో బిటెక్ 4వ సంవత్సరం చదువుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని, ఆయన మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.