Latest Updates
ఇంగ్లాండ్‌తో తొలి టెస్టుకు రవిశాస్త్రి అంచనా జట్టిది
ఈనెల 20న ప్రారంభమయ్యే ఇంగ్లాండ్‌తో తొలి టెస్టుకు భారత జట్టులో ఎవరెవరు ఉండబోతున్నారన్న దానిపై టీమ్ ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి తన అంచనాలను వెల్లడించారు. ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, KL రాహుల్ ఉండగా, మూడో నుంచి ఆరవ స్థానాల్లో సాయ్ సుదర్శన్, శుభమన్ గిల్, కరుణ్ నాయర్, రిషభ్ పంత్ క్రీజులోకి దిగుతారని చెప్పారు.
జడేజా, శార్దూల్ ఠాకూర్ ఏడో, ఎనిమిదో స్థానాల్లో బరిలోకి దిగుతారని రవి చెప్పారు. అయితే, నితీశ్ రెడ్డి ఒక టెస్టులో 12-14 ఓవర్లు బౌలింగ్ చేయగలిగితే బ్యాటింగ్ లో బలం కోసం శార్దూల్ స్థానంలో అతడిని తీసుకోవచ్చని సూచించారు. ముగ్గురు పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ కృష్ణ, మహ్మద్ సిరాజ్‌లను ఆడిస్తారని అంచనా వేశారు.