National
ఆపరేషన్ సిందూర్’కు హైదరాబాద్ ఆయుధాలు
ఆపరేషన్ సిందూర్’ తర్వాత హైదరాబాద్‌కు చెందిన డిఫెన్స్ కంపెనీలకు భారత సైన్యం నుంచి ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. DRDO, BDL, BELతో పాటు అదానీ ఎల్బిట్, ఆస్ట్రా మైక్రోవేవ్, అనంత్ టెక్నాలజీస్, ఎంటార్ టెక్నాలజీస్, జెన్ టెక్నాలజీస్ వంటి ప్రైవేట్ సంస్థలు ఆయుధాలు, మందుగుండు సామగ్రి, మిస్సైళ్లు, డ్రోన్ల విడి భాగాలను సరఫరా చేస్తున్నాయి.
స్కైస్ట్రైకర్ డ్రోన్లు, ఆకాశ్, బ్రహ్మోస్ మిస్సైళ్ల తయారీలో ఈ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ‘మేక్ ఇన్ ఇండియా’ లక్ష్యాలతో స్వదేశీ సాంకేతికతను ప్రోత్సహిస్తూ, హైదరాబాద్ భారత డిఫెన్స్ రంగంలో ‘మిస్సైల్ క్యాపిటల్’గా తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటోంది.