Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ న్యూస్ రౌండప్ – ముఖ్యమైన రాజకీయ, పరిపాలనా పరిణామాలు

Andhra Pradesh Govt Release Funds 1452 Crores to Local Bodies - ఏపీ  ప్రభుత్వం కీలక నిర్ణయం.. భారీగా నిధులు విడుదల

అమరావతి నగర అభివృద్ధి, అందచందాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాసేపట్లో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్ష సమావేశంలో నగర బ్యూటిఫికేషన్‌ ప్రాజెక్టుల పురోగతి, నిర్మాణాల వేగం, పర్యావరణ అనుకూలత తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అనంతరం ముఖ్యమంత్రి అన్నదాత సుఖీభవ పథకంపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. రైతుల సంక్షేమం కోసం చేపట్టిన ఈ స్కీమ్ అమలులో తగిన మార్గదర్శకాలను అధికారులకు అందించనున్నారని సమాచారం.

ఇక మరోవైపు తెలుగుదేశం పార్టీ కీలక నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన నేడు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలను ఈ సమావేశాల్లో లేవనెత్తే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

అటు మరోవైపు లిక్కర్ స్కాం కేసులో స్వాధీనం చేసుకున్న రూ.11 కోట్ల నగదుపై విజయవాడ ఏసీబీ కోర్టులో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఈ నగదుపై సిట్ పిటిషన్ దాఖలు చేయగా, కేసు దర్యాప్తులో ముందుకు వెళ్లేందుకు అనుమతించాలంటూ కోర్టును అభ్యర్థించింది. ఈ పిటిషన్‌పై నేడు విచారణ జరిగే అవకాశం ఉండగా, దర్యాప్తు దిశలో తదుపరి చర్యలపై స్పష్టత వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version