Latest Updates
అవార్డుల శోభ – స్వచ్ఛ సర్వేక్షణ్ గౌరవం
దేశం మొత్తం శుభ్రతపై దృష్టి సారించిన ఈ యుగంలో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు ఒక పెద్ద గౌరవప్రదమైన ఘట్టంగా మారాయి. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నగరాలు, పట్టణాలు, గ్రామాలు శుభ్రతపై దృష్టిసారించి ప్రజలకు ఆరోగ్యవంతమైన జీవనవాతావరణాన్ని అందించేందుకు కృషి చేస్తున్న నేపథ్యంలో, వారి సేవలను గుర్తించి అవార్డుల రూపంలో ప్రోత్సాహం అందించడం ఎంతో అభినందనీయం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డుల ప్రదానం జరగడం మరింత గౌరవాన్ని చేకూర్చింది. రాష్ట్రపతిగా ఒక మహిళ ఈ కార్యక్రమానికి అధిపతిగా ఉండటం మహిళా శక్తికి గుర్తింపుగా, దేశం మారుతోందన్న సంకేతంగా భావించవచ్చు.
ఈ అవార్డులు కేవలం గుర్తింపుగా మాత్రమే కాకుండా, నూతనంగా అభివృద్ధి దిశగా మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు తమ సేవలందన్లో మరింత నిబద్ధతతో పని చేయాలన్న స్పూర్తిని కలిగిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ ఉద్యమం గతంలో ఓ ఉద్యమంగా మొదలై, ఇప్పుడు ప్రజల హృదయాల్లో నిలిచిపోయింది. ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా, ప్రజల జీవనశైలిలో భాగంగా మారింది. ప్రతి ఇంటిలోనూ, ప్రతి వీధిలోనూ శుభ్రతపై అవగాహన పెరిగినందుకు ఇటువంటి ప్రోత్సాహక కార్యక్రమాలు మూల్యమైన పాత్ర పోషిస్తున్నాయి.