Business

అమెరికాకు ఇరాన్ బిగ్ షాక్: ఒక్క దెబ్బతో రూ. 10,000 కోట్ల నష్టం.. ఖతార్‌లో కీలక రాడార్ ధ్వంసం!

మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మరింతగా ముసురుకుంటున్నాయి. ఇజ్రాయెల్, అమెరికా కూటమి దాడులను ఎదుర్కొంటున్న ఇరాన్, తన వ్యూహాత్మక ప్రతిఘటనతో అగ్రరాజ్యాన్ని విస్మయానికి గురిచేస్తోంది. తాజాగా ఖతార్‌లో అమెరికాకు అత్యంత కీలకమైన బాలిస్టిక్ మిస్సైల్ రాడార్ వ్యవస్థను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. ఈ మెరుపు దాడిలో అమెరికాకు సుమారు 1.1 బిలియన్ డాలర్ల (రూ. 10,000 కోట్లు) భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.

ఖతార్‌లోని అమెరికా రాడార్ స్టేషన్‌పై ఇరాన్ డ్రోన్ దాడి,రూ. 10 వేల కోట్ల విలువైన నిఘా వ్యవస్థ చిన్నాభిన్నం,అమెరికా రక్షణ కవచంలో కీలకమైన ‘కంటి చూపు’ కోల్పోయినట్లయిందని నిపుణుల ఆందోళన.అమెరికా తన అత్యాధునిక బాంబర్లు, స్టెల్త్ ఫైటర్లతో విరుచుకుపడుతుంటే.. ఇరాన్ మాత్రం చాలా తక్కువ వ్యయంతో రూపొందించిన షహీద్ డ్రోన్లు, క్షిపణులతో ఎదురుదాడి చేస్తోంది. ఖతార్‌లోని AN/FPS-132 రాడార్ సిస్టమ్ దెబ్బతినడం అమెరికాకు కోలుకోలేని దెబ్బ. సుమారు 5,000 కిలోమీటర్ల దూరంలోని శత్రు క్షిపణులను పసిగట్టే ఈ వ్యవస్థ లేకపోతే, గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా బలగాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది.

శాటిలైట్ చిత్రాలు సైతం ఈ రాడార్ నెట్‌వర్క్ దెబ్బతిన్న విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. ఇరాన్ జరిపిన ఈ ‘ప్రిసిషన్ స్ట్రైక్’ వల్ల పశ్చిమాసియాలో అమెరికా నిఘా సామర్థ్యం భారీగా తగ్గిందని, థాడ్, పాట్రియాట్ వంటి రక్షణ వ్యవస్థల సమన్వయం కష్టతరమవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version