Andhra Pradesh
అట్లీ-అల్లు అర్జున్ ‘A22xA6’ మూవీలో హీరోయిన్‌గా దీపికా పదుకొణె
అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో రూ.800 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ‘A22xA6’ సినిమా నుంచి ఆసక్తికర అప్డేట్ వెలువడింది. ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తున్నట్లు చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.
ఈ సందర్భంగా మేకర్స్ ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో డైరెక్టర్ అట్లీ దీపికాతో స్క్రిప్ట్ గురించి చర్చిస్తూ, అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి ఆమెతో ఓ సీన్‌ను చిత్రీకరిస్తున్న దృశ్యాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
ఈ భారీ ప్రాజెక్ట్‌లో అల్లు అర్జున్, దీపికా పదుకొణె జోడీ, అట్లీ దర్శకత్వ ప్రతిభ కలిసి ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ అనుభవాన్ని అందించనుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.