Latest Updates
బంగారం ధరలు మళ్లీ జోరందుకున్నాయి
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.430 పెరిగి రూ.99,600కు చేరుకుంది. అదే సమయంలో, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400 పెరిగి రూ.91,300 వద్ద నిలిచింది. ఇక వెండి ధరల విషయానికొస్తే, కేజీ వెండి ధర రూ.5,100 పెరిగి రూ.1,14,000కు చేరింది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో కూడా దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి.
మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం, బంగారం ధరలు రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. నేడో రేపో 24 క్యారెట్ల బంగారం ధర రూ.లక్ష మార్కును తాకే సూచనలు కనిపిస్తున్నాయి. పెరుగుతున్న ఈ ధరల నేపథ్యంలో, పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు నిపుణులు.