Connect with us

Business

Reliance Shares: ఆ రెండు కారణాలతో దూసుకెళ్తున్న అంబానీ షేర్లు..

Reliance Shares: ఆ రెండు కారణాలతో దూసుకెళ్తున్న అంబానీ షేర్లు.. మళ్లీ అప్పర్ సర్క్యూటే.. 5 రోజుల్లో 50 శాతం జంప్!

భారత స్టాక్ మార్కెట్లు.. శుక్రవారం రోజు భారీగా పెరిగాయి. దీంతో సరికొత్త చరిత్ర నమోదైంది. ఈ వార్త రాసే సమయంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 780 పాయింట్ల లాభంతో 84 వేల మార్కుకు సమీపంలో ఉంది. ఇదే సమయంలో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 250 పాయింట్లు పెరిగి 25 వేల 700 మార్కు వద్ద ఉంది. మార్కెట్లు పుంజుకుంటున్న క్రమంలోనే కొన్ని స్టాక్స్ అదరగొడుతున్నాయని చెప్పొచ్చు. ఇందులో ప్రధానంగా మనం అనిల్ అంబానీ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇటీవల తన కంపెనీలకు సంబంధించిన రుణాల్ని చాలా వరకు అంబానీ తగ్గించుకున్నారు. రిలయన్స్ పవర్‌లో మొత్తం రూ. 3872 కోట్ల మేర రుణాలు తీర్చేసినట్లు చెప్పారు. దీంతో ఈ స్టాక్ వరుసగా పుంజుకుంటూనే ఉంది.

ఇదే సమయంలో అనిల్ అంబానీకే చెందిన రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ కూడా పెద్ద మొత్తంలో ఐసీఐసీఐ బ్యాంక్ సహా ఎడెల్‌వీస్ వంటి సంస్థలకు లోన్లను తీర్చేసింది. మరో 475 కోట్ల వరకు మాత్రమే బకాయిలు ఉన్నట్లు రెండు రోజుల కిందట స్టాక్ ఎక్స్చేంజి ఫైలింగ్‌లో వెల్లడించింది. ఇదే క్రమంలో.. ఈ స్టాక్ కూడా వరుస రెండు సెషన్లలో భారీగా పెరిగింది. ఒక సెషన్లో ఏకంగా 20 శాతం అప్పర్ సర్క్యూట్ కూడా కొట్టింది.

ఇప్పుడు మరోసారి రిలయన్స్ ఇన్‌ఫ్రా కీలక ప్రకటన చేసింది. సేల్ ఆఫ్ షేర్స్, కన్వర్టబుల్ వారెంట్స్ ద్వారా రూ. 6014 కోట్ల మేర నిధుల్ని సమీకరించనున్నట్లు గురువారం ప్రకటించింది. బోర్డ్ మీటింగ్ తర్వాత ఈక్విటీ షేర్ల ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా రూ. 3014 కోట్లు సమీకరించనున్నట్లు తెలిపింది. ఈ రెండు కారణాలతో స్టాక్ రికార్డు స్థాయిలో దూసుకెళ్లింది.

శుక్రవారం సెషన్ ఇంట్రాడేలో దాదాపు 15 శాతం పెరిగి రూ. 327.70 వద్ద 52 వారాల గరిష్ట స్థాయిని తాకింది. ప్రస్తుతం 12 శాతం లాభంతో రూ. 316.60 వద్ద ఉంది. మార్కెట్ విలువ రూ. 12.54 వేల కోట్లుగా ఉంది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ట ధర రూ. 327.70 కాగా.. కనిష్ట విలువ రూ. 144.45 గా ఉంది. కొద్ది రోజులుగా ఈ షేరు దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. గత 5 రోజుల్లో చూస్తే ఏకంగా ఈ స్టాక్ దాదాపు 50 శాతం పెరగడం విశేషం. ఏడాది వ్యవధిలో 82 శాతం పుంజుకుంది. ఐదేళ్లలో చూస్తే ఇన్వెస్టర్లకు కాసుల పంట పండించింది. ఏకంగా 765 శాతం ఎగబాకింది.

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *