Connect with us

Uncategorized

సెప్టెంబర్ నుంచి మారబోయే ముఖ్యమైన విషయాలు

8+ Thousand Press Release Newspaper Royalty-Free Images, Stock Photos &  Pictures | Shutterstock

సెప్టెంబర్ నెలలో పలు ఆర్థిక, బ్యాంకింగ్, పన్ను సంబంధిత మార్పులు చోటుచేసుకోనున్నాయి. సాధారణ ప్రజలకు ప్రభావం చూపే ఈ మార్పులను ఒకసారి చూద్దాం.

  1. GST కొత్త శ్లాబులు
    సెప్టెంబర్ 3, 4 తేదీల్లో జరగనున్న 56వ GST కౌన్సిల్ సమావేశంలో ప్రస్తుతం ఉన్న 4 శ్లాబుల బదులు కేవలం 5% మరియు 18% మాత్రమే కొనసాగించే అవకాశం ఉంది.

  2. వెండి ఆభరణాలకు హాల్‌మార్క్ తప్పనిసరి
    రేపటి నుంచి వెండి ఆభరణాలపై కూడా హాల్‌మార్క్ విధానం అమల్లోకి రావచ్చు. దీంతో కస్టమర్లు నాణ్యత గల ఆభరణాలు పొందే అవకాశం ఉంటుంది.

  3. SBI క్రెడిట్ కార్డులపై మార్పులు
    కొందరు SBI క్రెడిట్ కార్డుల ద్వారా డిజిటల్ గేమింగ్, ప్రభుత్వ పోర్టల్స్‌లో చేసే చెల్లింపులకు ఇకపై రివార్డు పాయింట్లు లభించవు.

  4. జన్‌ధన్ ఖాతాల KYC
    జన్‌ధన్ ఖాతాదారులు తమ KYC వివరాలను సెప్టెంబర్ 30లోపు తప్పనిసరిగా పూర్తి చేయాలి.

  5. ITR ఫైలింగ్ చివరి తేదీ
    2025-26 అసెస్‌మెంట్ ఇయర్‌కు సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయడానికి సెప్టెంబర్ 15 చివరి తేదీగా నిర్ణయించబడింది.

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *