Entertainment
రాశీ ఖన్నా బ్రేకప్ స్టోరీ.. ఆ టైంలో చాలా బాధ పడ్డా..!
టాలీవుడ్‌లో “ఊహలు గుసగుసలాడే” సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ రాశీ ఖన్నా, తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు పొందింది. ఒకప్పుడు తెలుగు యంగ్ హీరోలకి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా రాశీ ఖన్నా సినిమాలు చేసింది. కోలీవుడ్‌లోనూ పలు సినిమాలు చేసి, అక్కడ కూడా పెద్ద అభిమానులను సంపాదించుకుంది. తాజాగా బాలీవుడ్‌లో “ది సబర్మతి రిపోర్ట్” సినిమాతో హీరోయిన్‌గా నటించింది రాశీ. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ప్రస్తుతం ఆమె ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది.
ఈ సినిమా ద్వారా రాశీ ఖన్నాకు హిందీలో పెద్ద విజయం రాబట్టే అవకాశం ఉన్నట్లు మేకర్స్ నమ్ముతున్నారు. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా, రాశీ ఖన్నా ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ మరియు వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. తన లవ్ బ్రేకప్ గురించి కూడా మాట్లాడింది, మరియు ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాను చాలా ఎమోషనల్ పర్సన్‌ని అన్నారు రాశీ. గతంలో తనకు లవ్ స్టోరీ ఉండి, కొన్ని కారణాల వల్ల బ్రేకప్ అయ్యిందని చెప్పింది. బ్రేకప్ వల్ల కలిగే బాధ గురించి కూడా మాట్లాడి, ఆ బాధ నుంచి బయట పడటానికి తనకు చాలా సమయం పట్టిందని చెప్పింది. మానసికంగా తాను కుంగిపోయినప్పుడు, స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు తనకు మద్దతు ఇచ్చారని రాశీ తెలిపింది. “ఆ సమయంలో నన్ను నేను మార్చుకుంటూ, మానసికంగా దృఢంగా మారానని. బ్రేకప్‌ను మరిచి, కెరీర్‌పై దృష్టి పెట్టానని” ఆమె చెప్పింది.
“బ్రేకప్ జీవితాన్ని మార్చేస్తుంది. ఆ సమయంలో తీసుకునే నిర్ణయాలు, మద్దతుగా ఉండే వారిపై మన కెరీర్ ఆధారపడి ఉంటుంది” అని రాశీ లైఫ్ లెస్సన్ ఇచ్చింది. అయితే, ఆమె బ్రేకప్ గురించి చెప్పినప్పటికీ, అతడు ఎవరో అని మాత్రం క్లూ ఇవ్వలేదు.
![]()
