Entertainment
పడయప్ప రిటర్న్స్: తలైవా పుట్టినరోజుకు భారీ గిఫ్ట్… డిసెంబర్ 12న ‘నరసింహ’ 4Kలో గ్రాండ్ రీ-రిలీజ్!
భారతీయ సినిమా చరిత్రలో అరుదైన స్థానాన్ని సొంతం చేసుకున్న సూపర్‌స్టార్ రజనీకాంత్, అనంతమైన స్టైల్‌కు చిరునామాగా నిలిచి నేటితో 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తిచేసుకున్నారు. 1975లో *‘అపూర్వ రాగంగల్’*లో చిన్న పాత్రతో మొదలైన ప్రయాణం, అర్ధ శతాబ్దానికి చేరుకునేలా సాగిపోవడం ఆయన ప్రతిభకు, ప్రజాదరణకు నిదర్శనం.
ఈ స్వర్ణోత్సవ సందర్భాన్ని గుర్తుగా మార్చాలనుకున్న ఫిల్మ్‌మేకర్స్, రజనీకాంత్ పుట్టినరోజు కానుకగా ఆయన కెరీర్‌లో అజరామరమైన క్లాసిక్ *‘పడయప్ప/నరసింహ’*ను మరోసారి థియేటర్లకు తీసుకువస్తున్నారు. 1999లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్‌ను ఒక్కసారిగా షేక్ చేస్తూ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
స్టైలిష్ ఫైటింగ్, పంచ్ డైలాగ్స్ మరియు సెంటిమెంట్స్‌తో కె.ఎస్. రవికుమార్ తీసిన ఈ ఫిల్మ్‌లో రజినీ అభిమానులకు పునకం పుట్టించే రీతిలో ఆయన నటించగా, రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్ర తమిళ–తెలుగు సినీ చరిత్రలో అత్యంత శక్తివంతమైన విలన్ పాత్రలలో ఒకటిగా నిలిచింది. హీరో–విలన్ మధ్య ప్రతి సీన్ కూడా చప్పట్లు వ
ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా, డిసెంబర్ 12న ఈ సినిమాను సరికొత్త 4K ప్రింట్ మరియు డాల్బీ అట్మాస్ సౌండ్‌తో తిరిగి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. కొత్త సినిమా విడుదలకు ఏవీ తీసిపోని ప్రచారాలతో ఈ ప్రాజెక్ట్‌ని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు.
అర శతాబ్దపు సినీ ప్రయాణంలో రజనీకాంత్ ఎన్నో బ్లాక్‌బస్టర్లను అందించినా, ‘నరసింహ’ ఆయనను పాక్ మాస్ ఐకాన్‌గా నిలబెట్టిన టైమ్‌లెస్ మూవీ. అందుకే ఈ రీ-రిలీజ్ అభిమానుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది.
ఈసారి ‘నరసింహ’ రీ-రిలీజ్ మరో సంచలనాన్ని సృష్టిస్తుందా? తలైవా స్టైల్‌ను మళ్లీ పెద్ద తెరపై చూడబోయే అభిమానులు ఏ విధమైన రికార్డులు సృష్టిస్తారో చూడాల్సిందే.
#Rajinikanth #Narasimha #Padayappa #SuperstarRajini #RajinikanthBirthday #Rajini50Years #RajinikanthFans #RamyaKrishna #Neelambari #TamilCinema #TeluguCinema #Kollywood #CultClassic #4KReRelease #RajiniMania #Thalaiva #IndianCinema #MassHero #KS_Ravikumar #RajiniStyle
![]()
