Latest Updates

కీలక రైల్వే అప్‌డేట్.. తెలంగాణలో కొత్త రైలు మార్గానికి గ్రీన్ సిగ్నల్ దిశగా

వికారాబాద్–కృష్ణా మధ్య ప్రతిపాదిత నూతన రైల్వే మార్గం నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. ఈ రెండు స్టేషన్లను నేరుగా అనుసంధానించే కొత్త రైల్వేలైన్‌కు సంబంధించి క్షేత్రస్థాయి సర్వే పూర్తయిందని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. సుమారు 130 కిలోమీటర్ల పొడవునా ఈ మార్గాన్ని అభివృద్ధి చేయ

ప్రస్తుతం వికారాబాద్ నుంచి కృష్ణాకు రైలు ప్రయాణం చేయాలంటే కర్ణాటకలోని వాడి మార్గం మీదుగా వెళ్లాల్సి వస్తోంది. దీనివల్ల ప్రయాణ దూరంతో పాటు సమయం కూడా ఎక్కువగా ఖర్చవుతోంది. అయితే ఈ కొత్త రైలు మార్గం నిర్మాణం పూర్తయితే, ప్రయాణ దూరం తగ్గడమే కాకుండా, ప్రయాణికులకు వేగవంతమైన రవాణా సౌకర్యం అందుబాటులోకి

ఈ ప్రాజెక్టు తదుపరి దశలో ఫీల్డ్ సర్వే వివరాల ఆధారంగా డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) సిద్ధం చేయనున్నారు. డీపీఆర్ పూర్తైన అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహా సంబంధిత భాగస్వామ్య సంస్థలతో చర్చలు జరిపి, కేంద్ర ప్రభుత్వం తుది ఆమోదం తెలపనుంది. ఈ రైల్వేలైన్ అమలులోకి వస్తే, ప్రాంతీయ అభివృద్ధి, వాణిజ్య కార్యకలాపాలు, ప్రయాణికుల రాకపోకలు మరింత మెరుగవుతాయని రైల్వే అధికారులు భావిస్తున్నారు.

జన్మభూమి ఎక్స్‌ప్రెస్ వేళల్లో మార్పు – ఫిబ్రవరి 15 నుంచి అమలు

విశాఖపట్నం–లింగంపల్లి మధ్య నిత్యం ప్రయాణించే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సమాచారం ఇచ్చింది. జన్మభూమి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు చేసినట్లు ప్రకటించింది. సవరించిన కొత్త వేళలు ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి వస్తాయని జోన్ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ఏ. శ్రీధర్ తెలిప

కొత్త టైమ్ టేబుల్ ప్రకారం

విశాఖపట్నం–లింగంపల్లి (12806) రైలు ఉదయం 6.20గంటలకు విశాఖపట్నం నుంచి బయల్దేరి, రాత్రి 7.15గంటలకు లింగంపల్లికి చేరుకుంటుంది.

లింగంపల్లి–విశాఖపట్నం (12805) రైలు ఉదయం 6.55కి లింగంపల్లి నుంచి బయల్దేరి, రాత్రి 7.50కి విశాఖపట్నం చేరుకుంటుంది.

సంక్రాంతి ప్రత్యేక రైళ్ల సేవలకు పొడిగింపు

సంక్రాంతి పండుగ నేపథ్యంలో పెరిగిన ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక వీక్లీ రైళ్ల సేవలను మరికొన్ని వారాల పాటు పొడిగించింది.

సికింద్రాబాద్–అనకాపల్లి 07041 విశాఖ ప్యాసింజర్ జనవరి 4, 11, 18 తేదీల్లో

07042 APS – SC Spl AC will run on 5th 12th & 19th January.

అలాగే,

Hyderabad-Gorakhpur Special Train Hyderabad-Gorakhpur(07075) స్పెషల్ రైలు: జనవరి 9, 16, 23 తేదీల్లో

హైదరాబాద్–గోరఖ్‌పూర్ (07075), గోరఖ్‌పూర్–హైదరాబాద్ (07076) రైళ్లు జనవరి 11, 18, 25 తేదీల్లో అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు.

#IndianRailways#VikarabadKrishnaRailLine#NewRailwayLine#RailwaySurvey#AshwiniVaishnaw#TelanganaRailways#SouthCentralRailway
#JanmabhoomiExpress#TrainTimings#SpecialTrains#SankrantiSpecial#RailwayNews#TeluguRailwayNews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version