Andhra Pradesh
నేపాల్ నుంచి మనవాళ్లు వచ్చేస్తున్నారు: లోకేశ్
నేపాల్లో ఇటీవల చోటుచేసుకున్న పరిస్థితుల మధ్య అక్కడ చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ వాసులను సురక్షితంగా భారత్కు తీసుకురావడంపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఈ మేరకు ఐటీ, గ్రామీణాభివృద్ధి మంత్రి నారా లోకేశ్ వివరాలు వెల్లడించారు. హేటౌడా నుంచి బయలుదేరిన 22 మంది ఇప్పటికే బస్సు ద్వారా బిహార్ చేరుకున్నారని ఆయన తెలిపారు.
అదేవిధంగా, సిమికోట్ నుంచి 12 మందిని ఛార్టర్ ఫ్లైట్లలో నేపాల్గంజ్కు తరలించగా, పోఖ్రా నుంచి కాఠ్మాండూకు మరికొందరిని సురక్షితంగా తరలించినట్లు తెలిపారు. భద్రత కోసం ఎంబసీ, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం కొనసాగుతున్నదని, ఏపి ప్రజలు ఎవరూ ఇబ్బందులు పడకుండా తక్షణ చర్యలు తీసుకుంటున్నామని లోకేశ్ స్పష్టం చేశారు.
ప్రస్తుతం కాఠ్మాండూలో చేరిన 133 మందితో పాటు మొత్తం 200 మందికి పైగా ప్రయాణికులు ఒకే విమానంలో భారత్కు రానున్నారని మంత్రి తెలిపారు. “మన ప్రజలందరినీ సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడం మా మొదటి ప్రాధాన్యత. ఈ ప్రక్రియలో ఎవరూ వెనుకబడరని హామీ ఇస్తున్నాం” అని లోకేశ్ ధైర్యం ఇచ్చారు.
![]()
