Telangana

Software Woman Murdered in Miyapur మియాపూర్​లో సాఫ్ట్​వేర్​ ఉద్యోగిని దారుణ హత్య

మియాపూర్​లో సాఫ్ట్​వేర్​ ఉద్యోగిని దారుణ హత్య – అతడి పనేనా? – Software Woman Murdered in Miyapur

Young Software Woman Murdered in Hyderabad : వివాహితను తన ఇంట్లో పదునైన ఆయుధంతో హత్య చేసిన ఘటన మియాపూర్​లో స్థానికంగా కలకలం రేపుతుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న కొన్ని రోజుల క్రితం భర్త వేధింపులు భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారి విడాకుల కేసు కోర్టులో ఉండగానే తను హత్యకు గురైంది.

 వివాహితను పదునైన ఆయుధంతో ఆమె ఇంట్లోనే హత్య చేసిన ఘటన మియాపూర్​లో చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, దీప్తిశ్రీనగర్​ సీబీఆర్​ ఎస్టేట్​ 3ఏ బ్లాక్​లో ఉండే ప్రైవేట్ స్కూల్​ టీచర్​ కుమార్తె బండి స్పందన (29) సాఫ్ట్​వేర్ ఉద్యోగం చేస్తుంది. ఇంటర్ చదువుతున్న సమయంలో అదే కాలనీకి చెందిన వినయ్​ కుమార్​ను ప్రేమించింది. 2022 ఆగస్టులో పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది. ఆమె భర్త ఓ ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్​. 2023లో భర్త వేధిస్తున్నాడంటూ మియాపూర్​ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేయడంతో అతనిపై కేసు నమోదైంది. వారిద్దరి విడాకుల కేసు కోర్టులో ఉంది.

paఠశాలలో విధులకు వెళ్లగా, స్పందన ఇంట్లోనే ఉంది. మధ్యాహ్నం వారింటికి సమీపంలో నివాసం ఉండే సోదరి వచ్చి ఇంటి తలుపు తడితే తీయలేదు. దీంతో ఆమె తిరిగి వెళ్లిపోయింది. సాయంత్రం స్కూల్​ నుంచి తిరిగి వచ్చిన తల్లి కాలింగ్​ బెల్​ నొక్కినా తీయలేదు. స్పందన ఫోన్​కు కాల్​ చేసినా స్పందించకపోవడంతో స్థానికుల సాయంతో తలుపు బద్దలు కొట్టి తెరిచి చూడగా అప్పటికే హత్యకు గురైంది.

దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆయుధంతో విచక్షణారహితంగా పొడిచినట్లు కనిపిస్తున్నాస అక్కడ ఎలాంటి ఆయుధం లభించలేదని పోలీసులు తెలిపారు. హత్య చేసింది తెలిసిన వారేనా? అనే కోణంలో విచారిస్తున్నట్లు చెప్పారు. అపార్టుమెంట్​తో పాటు పరిసర ప్రాంతాల్లో సీసీ ఫుటేజీనీ పరిశీలిస్తున్నామన్నారు.

మారిన్ని వివరాల కోసం y cube mediaని సంప్రదించండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version