International

WTC 2025-27: భారత్ ఆడే మ్యాచులు ఎన్నంటే?

WTC 2025–27 Schedule Announced: India to Play 18 Test Matches, Begins  Campaign Against England - NTV Telugu

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 సీజన్ ముగిసిన నేపథ్యంలో, కొత్త సీజన్ 2025-27 ఈ నెల 17 నుంచి ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో తొమ్మిది జట్లు మొత్తం 71 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఈ జట్లలో ఆస్ట్రేలియా అత్యధికంగా 22 మ్యాచ్‌లు, ఇంగ్లండ్ 21 మ్యాచ్‌లు, భారత్ 18 మ్యాచ్‌లు, న్యూజిలాండ్ 16 మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఈ సీజన్‌లో మొదటి టెస్ట్ మ్యాచ్ శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల మధ్య జూన్ 17న గాలెలో ఆరంభం కానుంది. భారత జట్టు తన డబ్ల్యూటీసీ ప్రయాణాన్ని జూన్ 20 నుంచి ఇంగ్లండ్‌తో జరిగే ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌తో ప్రారంభిస్తుంది. ఈ సిరీస్‌లో హెడింగ్లీ, ఎడ్జ్‌బాస్టన్, లార్డ్స్, ఓల్డ్ ట్రాఫోర్డ్, ది ఓవల్ వంటి ఐకానిక్ వేదికల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి.

భారత జట్టు ఈ సీజన్‌లో మొత్తం ఆరు సిరీస్‌లలో 18 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో మూడు సిరీస్‌లు ఇంట్లో, మరో మూడు సిరీస్‌లు విదేశాల్లో ఉంటాయి. ఇంట్లో వెస్టిండీస్, దక్షిణాఫ్రికాతో రెండేసి టెస్ట్‌లు, ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది. విదేశాల్లో ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌లు, శ్రీలంక, న్యూజిలాండ్‌లతో రెండేసి టెస్ట్‌లు ఆడుతుంది. అక్టోబర్ 2025లో వెస్టిండీస్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్, నవంబర్-డిసెంబర్ 2025లో దక్షిణాఫ్రికాతో రెండు టెస్ట్‌ల సిరీస్ జరగనుంది. ఆగస్టు 2026లో శ్రీలంకలో రెండు టెస్ట్‌లు, అక్టోబర్-నవంబర్ 2026లో న్యూజిలాండ్‌లో రెండు టెస్ట్‌లు ఆడనుంది. చివరగా, జనవరి-ఫిబ్రవరి 2027లో ఆస్ట్రేలియాతో ఇంట్లో ఐదు టెస్ట్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌తో భారత్ ఈ సీజన్‌ను ముగించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version