Entertainment

డ్యుయెల్‌ రోల్‌‌లో విజయ్ దేవరకొండ… టాక్సీవాలా కాంబో రిపీట్‌

రౌడీ స్టార్‌ విజయ్ దేవరకొండ ఈ ఏడాది ఆరంభంలో ఫ్యామిలీ స్టార్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ ను అందుకోలేక పోయింది. దాంతో గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్న సినిమా పై భారీ అంచనాలు పెట్టుకుని ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు. విభిన్నమైన కాన్సెప్ట్‌ తో దర్శకుడు రూపొందిస్తున్న ఆ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. గౌతమ్‌ తిన్ననూరితో చేస్తున్న సినిమా పూర్తి కాగానే విజయ్‌ దేవరకొండ తన తదుపరి సినిమాను రాహుల్ సంకృత్యన్‌ దర్శకత్వంలో చేయబోతున్నారు. ఇప్పటికే వీరి కాంబో మూవీ కన్ఫర్మ్‌ అయిందని, ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది.

2018 సంవత్సరంలో విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యాన్‌ కాంబినేషన్ లో టాక్సీవాలా సినిమా వచ్చింది. ఆ సినిమా కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. విభిన్న చిత్రాల దర్శకుడిగా రాహుల్‌ కి మంచి పేరు దక్కింది. ఆ సినిమా తర్వాత శ్యామ్ సింగరాయ్ సినిమాతో రాహుల్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నాని నటించిన ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో రాహుల్ తదుపరి సినిమా ఏంటా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో ఆయన విజయ్ దేవరకొండతో తన తదుపరి సినిమాను చేసేందుకు రెడీ అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్ పూర్తి అయిందని, ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోందట.

సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యాన్‌ కాంబో మూవీ షూటింగ్‌ నవంబర్ నుంచి ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ లోపు విజయ్ దేవరకొండ తన ప్రస్తుత సినిమా షూటింగ్ ను ముగించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు రాహుల్ సంకృత్యన్ చేసిన సినిమాలు దేనికి అదే అన్నట్లు చాలా విభిన్నమైన కాన్సెప్ట్‌ తో రూపొందాయి. విజయ్ దేవరకొండ తో చేయబోతున్న సినిమా కోసం ఒక పీరియాడిక్ కథ ను రాహుల్‌ రెడీ చేశారట. ఈసారి ఏకంగా 1860 నాటి కాలంకు రాహుల్ తీసుకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నాడనే సమాచారం అందుతోంది. విజయ్‌ దేవరకొండ ను రెండు విభిన్నమైన పాత్రల్లో చూపించబోతున్నారని తెలుస్తోంది.

తండ్రి, కొడుకు పాత్రల్లో విజయ్ దేవరకొండ నటించనున్నాడని, ఆ కాలంలో జరిగిన ఆసక్తిక పరిణామాలను, కథ ను దర్శకుడు వివరించే తీరు చాలా బాగుంటుందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఈ ఏడాది చివర్లో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కాబోతున్న ఈ సినిమా ను వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. టాక్సీవాలా సినిమా ఫలితం కారణంగా రాహుల్‌ సంకృత్యాన్‌ పై విజయ్ దేవరకొండ చాలా నమ్మకం పెట్టారు. ఆ నమ్మకంతోనే మరోసారి ఆయన దర్శకత్వంలో నటించేందుకు రెడీ అయ్యారు. ఈసారి రౌడీ స్టార్‌ కి కమర్షియల్‌ హిట్‌ ఇచ్చేందుకు రాహుల్‌ చాలా కష్టపడుతున్నాడని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version