Andhra Pradesh
UPI కిరాణా కింగ్
ఇప్పుడేమీ పర్సు తిప్పి నోట్లు లెక్కపెట్టే కాలం కాదు. ఇంటి పక్కన కిరాణా షాపు నుంచి పెద్ద షాపింగ్ మాల్ వరకూ… ఒకే “స్కాన్ చేసి పేమెంట్” ఫార్ములా నడుస్తోంది. తాజా రిపోర్ట్ ప్రకారం జూలై నెలలో కిరాణా విభాగం UPIలో టాప్ స్థానం సాధించింది. మొత్తం 303 కోట్ల ట్రాన్సాక్షన్లు జరగగా, దాదాపు ₹64,881 కోట్ల విలువైన సరుకులు ఈజీగా కొనుగోలు అయ్యాయి. పాలు, ఉప్పు, పప్పులు, కూరగాయలు, దినసరి అవసరాల కోసం ప్రజలు ఎక్కువగా UPIని వినియోగిస్తున్నారు.
టీ-టిఫిన్ సెంటర్ల రికార్డు
కిరాణా తరువాత UPI వినియోగం ఎక్కువగా ఉన్న విభాగం అంటే చిన్నచిన్న హోటళ్లు, టీ-టిఫిన్ సెంటర్లు. బండి వద్ద కప్పు టీకి కానీ, ఆఫీస్ ముందు స్నాక్స్‌కి కానీ… ఒక్క స్కాన్‌తో కట్టేస్తున్నారు. జూలైలో మాత్రమే ఈ విభాగంలో 100 కోట్ల పేమెంట్లు జరిగాయి. వాటి విలువ దాదాపు ₹13,794 కోట్లు. అంటే కేవలం టీ, టిఫిన్, స్నాక్స్ లాంటి డైలీ హాబిట్స్‌కి కూడా డిజిటల్ పేమెంట్స్ తప్పనిసరి అవుతున్నాయి.
మీరు ఎక్కువగా ఎక్కడ వాడుతున్నారు?
UPI వాడకం ప్రతి ఇంటికి సాధారణం అవుతోంది. షాపింగ్ మాల్స్, ఫార్మసీలు, రవాణా, ఆన్‌లైన్ ఆర్డర్స్ అన్నీ పక్కన పెడితే, ఎక్కువగా డైలీ లైఫ్‌లో కిరాణా షాపింగ్, కూరగాయలు, టీ బండ్లు, టిఫిన్ సెంటర్లకే పేమెంట్లు ఎక్కువగా వెళ్తున్నాయి. ఇప్పుడు ప్రశ్న – మీరు UPIని ఎక్కువగా ఎక్కడ వాడుతున్నారు? కిరాణా షాపులోనా? లేక ఆఫీస్ దగ్గర టీ బండిలోనా?