Tours / Travels

గోవా వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారా? ఒకసారి ఆలోచించండి..

నైరుతి రుతుపవనాల ఉపసంహరణ గుజరాత్, రాజస్థాన్ లలో ప్రారంభమైంది. అయితే సెప్టెంబర్ 24 మంగళవారం ముంబై, పలు ఇతర మహారాష్ట్ర జిల్లాలు, కోస్తా కర్ణాటక, గోవా తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దేశ రాజధాని ఢిల్లీలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది.

గోవాకు రెడ్ అలర్ట్
భారత వాతావరణ శాఖ మంగళవారం గోవా (Goa), గోవా సమీప జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. గోవా సహా కోస్తా కర్ణాటక లోని పలు జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు, మహారాష్ట్రంలోని మరాఠ్వాడా ప్రాంతం, మధ్య మహారాష్ట్రకు, అలాగే, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటకకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కొంకణ్, గోవా, కోస్తా కర్ణాటక, మధ్యప్రదేశ్, విదర్భ, చత్తీస్ గఢ్, సబ్ హిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఒడిశా తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.

20 సెంమీలకు పైగా వర్షపాతం
కొంకణ్, గోవా, కోస్తా కర్ణాటక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు (> 20 సెంటీమీటర్లు) కురిసే అవకాశం ఉంది. మధ్య మహారాష్ట్ర, మరాఠ్వాడా, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటకలో భారీ నుంచి అతిభారీ వర్షాలు (≥12 సెంటీమీటర్లు) కురిసే అవకాశం ఉందని ఐఎండీ తన వాతావరణ బులెటిన్ లో తెలిపింది. కేరళ, మాహే, ఉత్తరప్రదేశ్, అండమాన్ నికోబార్, పశ్చిమబెంగాల్, సిక్కిం, బీహార్, జార్ఖండ్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి తదితర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ (IMD) తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version