Telangana

తెలంగాణాలో చలి చంపేస్తుంది.. పలు జిల్లాలకు అలర్ట్..

తెలంగాణలో చలి పులి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకి కుదుపుకుంటూ, తీవ్రంగా పడిపోతున్నాయి. గత రెండు రోజులుగా చలి మరింతగా పెరిగింది. కొన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకూ దిగువన నమోదవుతున్నాయి. బుధవారం, రాష్ట్రంలోని అత్యల్ప ఉష్ణోగ్రతలు సిర్పూర్ 10.5°C, పొచ్చెర 11.8°C, కుంటాల 12.6°C, ర్యాలీ 13.1°C చొప్పున నమోదు అయ్యాయి. నవంబర్ నెలలో ఇటువంటి కనిష్ట ఉష్ణోగ్రతలు ఎప్పుడూ రాలేదు.

ఉష్ణోగ్రతలు పడిపోతున్న నేపథ్యంలో వాతావరణశాఖ అలర్ట్ ప్రకటించింది. ఆరు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరుకున్నట్లు చెప్పారు. మంచిర్యాల, మెదక్, నిర్మల్, ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, సంగారెడ్డి జిల్లాలలో ఉష్ణోగ్రతలు దిగువకు పడిపోతున్నాయి. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మిగతా జిల్లాల్లో 15 డిగ్రీల చుట్టూ ఉష్ణోగ్రతలు నమోదవవచ్చు. హైదరాబాద్ శివారులో కూడా 15 డిగ్రీలకు దిగువ ఉష్ణోగ్రతలు కనిపిస్తున్నాయి.

చలి తీవ్రత కారణంగా, రాష్ట్రంలోని చిన్న వ్యాపారులు, స్కూల్‌కు వెళ్లే విద్యార్థులు, ఉదయాన్నే వాహనాలు నడిపే ప్రయాణికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. పొగమంచు కారణంగా వాహనదారులు రోడ్లపై నడిపించడానికి జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోంది. రానున్న రోజుల్లో చలి మరింతగా పెరుగవచ్చని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.

చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో, తెలంగాణ సర్కార్ హెల్త్ అడ్వైజరీ జారీ చేసింది. చలికి ముందు జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరోగ్య సమస్యలు, మృతి కూడా సంభవించవచ్చని చెప్పింది. హైపోథెర్మియా, చర్మంపై గాయాలు, పెర్నియో, ఇమ్మర్షన్ వంటి వ్యాధుల పరిస్థితి అధికంగా ఉండవచ్చని చెప్ప్తున్నారు.

చలి నుండి తప్పించుకోవడానికి, వృద్ధులు, చిన్నారులు, దివ్యాంగులు, గర్భిణులు, బాలింతలు, మహిళలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వృద్ధులకు వేడి ఆహారం తీసుకోవడం, పూర్తిగా కప్పిపెట్టే వస్త్రాలు ధరించడం, చిన్నారులను చలికి బయటకు తీసుకువెళ్ళకూడదని హెచ్చరించారు. ఎక్కువ రోజులు జలుబు, ఫ్లూ, ముక్కు నుండి రక్తం రావడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించమని సూచించారు. చలి గాలిలో పనిచేసే కార్మికులు, వీధుల్లో నివసించే నిరాశ్రయులు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version