Entertainment
బన్నీ గోవా వీడియోపై క్లారిటీ

బన్నీ గోవా వీడియోపై క్లారిటీ
నందమూరి బాలకృష్ణ “అన్‌స్టాపబుల్” షోలో అల్లు అర్జున్ గెస్ట్‌గా వచ్చి, తన వ్యక్తిగత విషయాలు పంచుకున్నాడు. బాలయ్యతో సరదాగా మాట్లాడుతూ, స్కూల్ రోజులు, స్నేహితులు, గోవాలో వైన్ షాప్‌లోని వీడియోపై క్లారిటీ ఇచ్చాడు. ఆ సమయంలో గోవాలో తన ఫ్రెండ్ సందీప్ కోసం వైన్ షాప్‌కు వెళ్లాడని, ఆ బ్రాండ్‌ను తెప్పించమని అడిగినప్పుడు వెళ్లానని వివరించాడు. తన ఫ్రెండ్ బాలయ్యకు పెద్ద అభిమానిగా, స్టేజ్‌పై కూడా పరిచయం చేశాడు.
యంగ్ హీరోల గురించి మాట్లాడుతూ, మహేష్ బాబుకు ఎంతో గౌరవం ఉందని, ఆయన తెలుగు సినిమా స్థాయిని పెంచుతుంటాడని చెప్పాడు. పవన్ కళ్యాణ్ ధైర్యం, ఎవర్ని కూడా పట్టించుకోని ధైర్యం ఇష్టమని, ప్రభాస్ ఆరడుగుల బంగారం అని ప్రస్తావించాడు.
అలాగే, “రుద్రమదేవి” కోసం గుణశేఖర్ రాసిన గెస్ట్ రోల్‌లో నటించిన అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు. సినిమాకు అందరూ ముందుకు రాకపోవడంతో, తానే ముందుకు వచ్చి ముప్పై రోజులు షూట్ చేశాడని చెప్పాడు. త్రివిక్రమ్‌తో తన తదుపరి సినిమా చేయబోతున్నట్టు ప్రకటించాడు.
ఈ తరం హీరోల్లో విజయ్ దేవరకొండ, సిద్దు, విశ్వక్ సేన్, నవీన్ పొలిశెట్టి, అడివి శేష్ అంటే ఇష్టమని అన్నాడు. ముఖ్యంగా “డీజే టిల్లు”లోని సిద్దు ప్రదర్శన ఇష్టమని బన్నీ తెలిపాడు.